![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -99 లో.. నా మాట అంటే విలువ లేనివాడివి.. నా సొమ్ము ఎలా తింటున్నావని రామరాజు అనగానే.. ప్రేమ తినే దగ్గర నుండి లేస్తుంది. ఎన్ని అబద్ధాలు నమ్మిన ప్రతిసారీ వమ్ము చేస్తున్నావ్.. మొన్న నగలు అంటే అమ్మి పెళ్లికి ఖర్చు చేసుకున్నామన్నావ్.. ఇప్పుడు ఎలా వచ్చాయి నగలు అని రామరాజు అడుగుతుంటే.. ధీరజ్ ఏం సమాధానం చెప్పలేకపోతాడు. ఏం అనకండి అని వేదవతి రిక్వెస్ట్ చేస్తుంది.
కన్నందుకు ఒక ముద్ద పడేస్తాను కానీ మీకు ఈ ఇంటికి ఏం సంబంధం లేదు.. మీ కష్టం మీరే పడండి అని రామరాజు అనేసి వెళ్ళిపోతాడు. ధీరజ్ బాధపడుతుంటే వేదవతి వస్తుంది. అన్ని సమస్యలు ఒకేసారి ఆయన చుట్టూ చేరేసరికి ఆయన బాధలో ఉండి అలా అన్నాడని సర్ది చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఇది జరిగింది అని చెప్పాలని ఉంది కానీ చెప్పలేని సిచువేషన్ ఇలా ప్రతిసారీ నాన్నకి కోపం తెప్పించే పని చేస్తున్నానని ధీరజ్ బాధపడతాడు.
అదంతా విని నర్మద బాధపడుతుంది. మరొకవైపు ప్రేమ తన ఇంటివైపు చూస్తూ తన వాళ్ళు ప్రేమగా అన్నం తినిపించే జ్ఞాపకాలు గుర్తుచేసుకొని బాధపడుతుంది. తరువాయి భాగం లో రామరాజు ఇంట్లో అందరిని తీసుకొని భాగ్యం ఇంటికి బయల్దేరతాడు. ప్రేమ ధీరజ్ లు ఇద్దరు కాలేజీకి వెళ్తుంటే ఇలా ఉండకురా.. నాతో మాట్లాడమని ధీరజ్ ని వేదవతి అడుగుతుంది. అయిన పట్టించుకోకుండా ప్రేమని తీసుకొని ధీరజ్ కాలేజీకి వెళ్తాడు. మధ్యలో ప్రేమని దింపి ధీరజ్ వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |